సోనీ పిక్చ‌ర్స్  మ‌హేష్‌బాబు బ్యానర్స్ పై మేజ‌ర్‌

28 Feb,2019

ఇండియాలో ప్ర‌ముఖ నిర్మాణ‌, పంపిణీ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌ల‌యిక‌లో `మేజ‌ర్` అనే భారీ చిత్రం రూపొంద‌నుంది. అడివి ఎంట‌ర్ టైన్మెంట్‌, శ‌ర‌త్ చంద్ర‌, ఎ+జి మూవీస్ ఈ సినిమా నిర్మాణంలో స‌హ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. మేజ‌ర్ సినిమా షూటింగ్‌ను 2019 వేస‌విలో ప్రారంభిస్తారు. 2020లో సినిమాను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ద్వి భాషా చిత్రంగా తెలుగు, హిందీ భాష‌ల్లో భారీ బడ్జెట్‌తో నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొంద‌బోయే ఈ సినిమా శౌర్యం, త్యాగం మేళ‌వింపుగా ఇన్‌స్ఫైర్ చేసేలా ఉంటుంది. ఈ చిత్రం ద్వారా సోనీ పిక్చ‌ర్స్ సంస్థ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంది. అలాగే జిఎంబి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌నుంది. ఈ సినిమాతో తెలుగు సినిమా రేంజ్ పెర‌గ‌నుంది. 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. క్ష‌ణం, గూఢ‌చారి వంటి సూప‌ర్ డూప‌ర్ చిత్రాల్లో న‌టించి మెప్పించిన అడివిశేష్ ఇందులోహీరోగా న‌టిస్తున్నాడు. అలాగే ఈ సినిమాకు ర‌చ‌యిత‌గా కూడా వ‌ర్క్ చేశారు అడివిశేష్. గూఢ‌చారి ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. సోనీ పిక్చ‌ర్స్ ఇంటర్నేష‌న‌ల్ ప్రొడ‌క్షన్స్ హెడ్ లెయినె క్లెయినె మాట్లాడుతూ - ``ప్యాడ్ మాన్‌, 102 నాటౌట్ వంటి బాలీవుడ్ చిత్రాల‌తో పాటు మ‌ల‌యాళ చిత్రం 9ని ప్రేక్ష‌కుల‌కు అందించి వారికి ద‌గ్గ‌ర‌య్యాం. మేజ‌ర్ సినిమా విష‌యానికి వ‌స్తే ఇది శ‌క్తివంత‌మైన క‌థే కాదు.. మ‌న దేశంలోని వారిని, స‌రిహ‌ద్దుల‌ను దాటి ఉన్న ఇండియ‌న్స్‌ను ఇన్‌స్పైర్ చేసే చిత్ర‌మిది. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి ఇలాంటి ఓ గొప్ప సినిమాతో ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది`` అన్నారు. సోని పిక్చ‌ర్స ఎంట‌ర్‌టైన్‌మెంట్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వివేక్ కృష్ణాని మాట్లాడుతూ - ``మ‌హేష్‌గారు, న‌మ్ర‌త‌గారితో అసోసియేట్ కావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే వారిని హిందీ చిత్ర సీమ‌లోకి  మ‌న‌స్ఫూర్తిగా అహ్వానిస్తున్నాం. అలాగే హీరో అడివిశేష్‌, డైరెక్ట‌ర్ శ‌శికిర‌ణ్ తిక్క ల‌కు కూడా బాలీవుడ్‌లోకి వెల్‌కం చెబుతున్నాం`` అన్నారు. 
జి.మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్మెంట్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఘ‌ట్ట‌మ‌నేని మాట్లాడుతూ - ``మా జిఎంబి బ్యాన‌ర్‌లో ఇలాంటి యూనిక్, ఒరిజిన‌ల్ స్టోరీ తెర‌కెక్కించ‌బోతున్నందుకు హ్య‌పీగా ఉంది. ఇదొక నేష‌న‌ల్ హీరో మూవీ. మేజ‌ర్ సినిమా క‌థ విష‌యంలో అడివిశేష్‌, శ‌శికిర‌ణ్ తిక్క నిజాయతీ, విజ‌న్ ఆక‌ట్టుకున్నాయి. సోనీ పిక్చ‌ర్స్ రూపంలో మంచి నిర్మాణ సంస్థ మాతో జ‌త క‌లిసింది. ఇండియ‌న్ సినిమాల్లోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గొప్ప సినిమాల‌ను తీసుకొచ్చేలా సోనీ పిక్చ‌ర్స్‌తో క‌లిసి ముందుకు వెళ్తాం`` అన్నారు.
 

Recent News